సుమంత్ ‘ఇదం జగత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నాళ్లుగా సరైన సినిమాలు లేక ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన హీరో సుమంత్ ఇటీవలే ‘మళ్లీ రావా’ లాంటి భిన్నమైన సబ్జెక్ట్ చేసి అందరి మెప్పూ పొందాడు. ఈ విజయం అందించిన కొత్త ఉత్సాహంతో ఆయన తన తర్వాతి సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ కొంత నెగెటివ్ షేడ్స్ వున్న ఈ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఇదం జగత్’ అనే భిన్నమైన టైటిల్‌ను ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోయే ఈ సినిమాతో మలయాళీ నటి అంజు కురియన్ హీరోయిన్‌గా పరిచయం కానుంది.