అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్ వంటి ప్రేమకథలని తెరెకెక్కించిన కరుణాకరన్, సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ జరుగుతోంది. ఏప్రిల్ 20 వరకు ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు ఫిబ్రవరి 18, కె.ఎస్.రామారావు తనయుడు, ఈ సినిమా సహ నిర్మాత కె.ఎ.వల్లభ్ పుట్టినరోజు కూడా ఫిబ్రవరి 18నే కావడం విశేషం. ఈసందర్భంగా చిత్ర యూనిట్ అనుపమ పుట్టినరోజును సెలబ్రేట్ చేసి శుభకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ- నేను ఇంత గ్రాండ్‌గా నా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. నిర్మాత కె.ఎస్.రామారావు, సాయిధరమ్ సహా యూనిట్‌కు థాంక్స్ అన్నారు. నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ- అనుపమ పుట్టినరోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.