సినిమాల్లో విప్లవం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్ తొలి చిత్రంతోనే తనదైన గుర్తింపు సంపాదించుకుంది. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది. రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం వుండదని, అలాంటివి చేసుకుంటూ వెళితే బోర్ కొట్టేస్తుందని అంటోంది నిత్య. తాజాగా ఈమె నటించిన చిత్రం ‘అ!’. నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్, రెజీనా, ఈషా, శ్రీనివాస్ అవసరాల, నిత్యామీనన్, ప్రియదర్శి, మురళీశర్మ ముఖ్యపాత్రల్లో నటించిన ఆ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా నిత్యామీనన్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...
కొత్తగా అన్పించింది..
ఈ కథను ప్రశాంత్ చెప్పినపుడు ఎగ్జైట్ అయ్యా. చాలా కొత్తగా అన్పించింది. పాత్రలన్నీ భిన్నంగా డిజైన్ చేశారు. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాం. దానివల్ల కెరీర్ ఏమో అయిపోతోందనే టెన్షన్ లేదు. భిన్నమైన పాత్రలు చేయడమే కరెక్ట్.
అందుకే ఒప్పుకున్నా..
కథ విన్నప్పుడు కొత్తదనం కన్పించింది. ముఖ్యంగా నా పాత్ర నాకు బాగా నచ్చడంతో ఒప్పుకున్నా. దాంతోపాటు నాని నిర్మిస్తున్నాడని తెలియగానే చాలా ఆనందంవేసింది. నిజానికి ముందు రాధ పాత్ర కాని, కృష్ణవేణి పాత్ర చేయమన్నారు. నేను కూడా కృష్ణవేణి పాత్రకు రెడీ అయ్యాను. ఆ పాత్ర కొత్తగా అన్పించింది. ఎలా చేస్తానో అనే అనుమానం కలిగింది. కాంచనలో గంగ పాత్ర చేసినపుడు కలిగిన ఇంటెన్షన్ ఈ పాత్ర చేస్తున్నపుడు అన్పించింది.
విప్లవం రావాలి..
మూసధోరణిలో సినిమాలు కాకుండా కొత్త తరహా కథలు వచ్చినపుడే పరిశ్రమ కూడా మరింత ముందుకు వెళుతుంది. సినిమాల్లో విప్లవం రావాలి. ‘అ!’ సినిమా ఇలాంటి కొత్తదనానికి దారిచూపింది. నేను ఏ పాత్ర చేసినా అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని ఆలోచించి ఒప్పుకుంటాను. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుంది.
ప్రస్తుతం..
ప్రస్తుతం ప్రాణ అనే సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. అందులో ఒకే ఒక్క పాత్ర మాత్రమే కన్పిస్తుంది. సౌండ్ సింక్‌లో సినిమాను చేస్తున్నాం. 23 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేశాం. నా పాత్రను చూసి అందరూ షాక్ అవుతారు. అలాగే మహానటి సినిమాలో సావిత్రి పాత్రకోసం ననే్న అడిగారు. కానీ అది వర్కవుట్ కాలేదు. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలన్న ఆలోచన వుంది.

- శ్రీ