టీజర్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఏప్రిల్ 27న విడుదలకానున్న ఈ సినిమా ముంబై నేపథ్యంలో జరిగే మాఫియా కథతో తెరకెక్కుతోంది. కబాలి తరువాత రజనీ-పా.రంజిత్‌ల కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే అటు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమా కోసం బిజినెస్ పరంగా భారీ పోటీ నెలకొందని, ఈ సినిమా టీజర్‌ను మార్చి 10న విడుదల చేస్తారట. టీజర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు. రజీనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వండర్‌బార్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం తరువాత రోబో 2.0 విడుదల కానుంది.