విభిన్నమైన పాత్రలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బాయితో అమ్మాయి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పలక్ లల్వాని మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా హీరోయిన్‌కు మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జువ్వ. త్రికోటి పేట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ పలక్ లల్వాని చెప్పిన విశేషాలు... అబ్బాయితో అమ్మాయి సినిమా తరువాత దర్శకుడు త్రికోటి నన్ను ఈ సినిమా కోసం అడిగారు. కథ వినగానే బాగా నచ్చింది. ఆకట్టుకునే పాయింట్‌తోపాటు అన్ని రకాల కమర్షియల్ హంగులు ఉన్నాయి. ముఖ్యంగా నా పాత్ర బాగా నచ్చింది. ఇందులో పక్కింటి అమ్మాయిగా కన్పిస్తాను. సింపుల్‌గా వుండే అమ్మాయి. హీరో రంజిత్‌తో పనిచేయం ఆనందంగా వుంది. తనకు ఇది మొదటి సినిమా అయినా నటుడిగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం వుంది. నా మొదటి చిత్రం అబ్బాయితో అమ్మాయితో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినా ఆ సినిమా ఎఫెక్టు నామీద పడలేదు. జయాపజయాలు నటులపై ప్రభావాన్ని చూపవని నా ఫీలింగ్. హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని అనుష్క, సాయిపల్లవి తరహాలో భిన్నమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకోవాలని ఉంది. సినిమా విషయంలో కథతోపాటు దర్శకునికి నా ప్రాధాన్యత వుంటుంది. ప్రస్తుతం జి.వి.ప్రకాష్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు కేరింత ఫేం విశ్వాంత్‌తో ఓ సినిమా పూర్తయ్యింది. త్వరలోనే ఆ చిత్రం విడుదలవుతుంది అన్నారు.