ఊళ్లో పెళ్లికి... పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో జె.బి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అనేది క్యాప్షన్. సాక్షి చౌదరి కథానాయిక. ‘నిధి’ ప్రసాద్ దర్వకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ‘జెబి క్రియేషన్స్’ అధినేత విక్రమ్ మాట్లాడుతూ ‘‘సినిమా అనేది ఒక బిజినెస్. అందులో టార్గెట్ ఆడియన్స్. ఆడియన్స్ అంటే ముఖ్యంగా నేల టికెట్, మిడిల్ క్లాస్ బ్యాచ్. సినిమా స్టార్ట్ చేసే ముందు వాళ్లను సినిమా ఆకట్టుకుంటుందా? లేదా? అని ఆలోచించాం. ప్రేక్షకులు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా వినోదం అందిస్తుంది. మా బావగారు ‘నిధి’ ప్రసాద్ చాలా రిస్క్ తీసుకుని సినిమా చేశారు. సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్లంతా ఎంతో సహకరించారు’’ అన్నాడు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఇప్పుడున్న నిర్మాతల ఛాయలు లేకుండా విక్రమ్ సినిమాను బాగా తీశాడు. అతను దర్శకుడు ‘నిధి’ ప్రసాద్ మేనత్త కొడుకు. సాధారణంగా సినిమాలు తీసే వాళ్లలో రెండు రకాలుంటారు. కడుపులో నీళ్లు కదలకుండా హ్యాపీగా సినిమా తీసేవాళ్లు ఒకరు. ఎన్ని కష్టాలైనా పడి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకునేవాళ్లు ఇంకొకరు. ‘నిధి’ ప్రసాద్ తనను తాను కాంప్లికేటెడ్ చేసుకుని ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకుంటాడు. తనతో షూటింగ్ అంటే కష్టం. సినిమా అంతా బోలెడు మంది ఆర్టిస్టులున్నారు. తనతో షూటింగ్ జరిగినంత సేపు తిట్టుకుని, విడుదల తర్వాత హ్యాపీగా ఫీలయ్యే వాళ్లలో నేనూ ఒకణ్ణి. అంతకు ముందు అతనితో ‘అందరూ దొంగలే’, ‘మైఖేల్ మదన్ కామరాజు’, ‘్భగ్యలక్ష్మి బంపర్ డ్రా’ చేశా. ఇక, ఈ సినిమా విషయానికొస్తే కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో రూపొందింది. నేను భారీ బడ్జెట్ సినిమాలు చాలా చేశా. బడ్జెట్‌కన్నాఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీయడం చాలా కష్టం. ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా. వందశాతం ప్రేక్షకుల డబ్బుకి వినోదం అందిస్తుంది’’ అన్నారు. దర్శకుడు ‘నిధి’ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాను. ప్రతి క్యారెక్టర్‌కి ఒక్కో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. స్క్రిప్ట్ పరంగా చాలా కాంప్లికేటెడ్ మూవీ’’ అన్నారు.