కొత్త అవతారం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైలవకుశ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం కోసం మేకోవర్ విషయంలో చాలా సీరియస్‌గా వున్నాడు. ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మార్చినుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ స్లిమ్‌గా కనిపించేందుకు ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చాడు. ఈ సినిమాలో ఆయన లుక్ కొత్తగా వుంటుందని, సినిమా కూడా త్రివిక్రమ్ శైలిలో వుంటుందని టాక్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ లవర్ బాయ్‌గా కనిపించేందుకు బాగానే కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వర్కవుట్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.