ఛలో’ దర్శకుడితో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లై భారీ పరాజయం తరువాత నితిన్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘చల్‌మోహనరంగ’. త్రివిక్రమ్ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రంతోపాటు నితిన్ దిల్‌రాజు బ్యానర్‌లో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువహీరో మరో దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు- ఇటీవలే నాగశౌర్యతో ఛలో అంటూ మంచి విజయాన్ని అందించిన వెంకీ కుడుముల. చిన్న చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుని భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాతో వెంకీకి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.