బాల నటిగా తొలి ఫొటో ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలనటిగా 4వ ఏటనే చలనచత్ర రంగంలోకి అడుగుపెట్టిన శ్రీదేవి, తల్లిదండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్‌లతో మద్రాస్‌లోని టి.నగర్ పెరియర్ వీధిలో వున్న రోజులలో, అదే ఇంట్లోనున్న స్టిల్ ఫొటోగ్రాఫర్ జి.యన్.భూషణ్ (గొల్లపల్లి నాగభూషణం)తో ఆ కుటుంబానికి సన్నిహిత స్నేహబాంధవ్యం ఏర్పడింది. కొత్తగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న బాలనటి శ్రీదేవి, సినిమాకు పనికొచ్చేటట్టు రకరకాల భంగిమలలో భూషణ్ ఫొటోలు తీసారు. మద్రాస్‌లో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా రిటైర్ అయి, హైదరాబాద్‌లో ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రిగా వున్న రోజులలో స్పెషల్ ఆఫీసర్ విజువల్ మీడియా సెల్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిగా సేవలందించిన స్టిల్ ఫొటోగ్రాఫర్ భూషణ్, కెమెరా మాంత్రికునిగా తెలుగు చలన చిత్రరంగ మేటి నటీనటులందరి ఛాయాచిత్రాలను స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా అద్భుత నైపణ్యంతో తన కెమెరాలో బంధించారు. మద్రాస్‌లో ఒకనాటి బాల నటీనటులలో కాంచన, హేమమాలిని, జయసుధ, స్మిత, ప్రభ, నాగార్జున, మోహన్‌కందా వంటి వారే కాక పాలబుగ్గల శ్రీదేవి భవిష్యత్తులో బాలీవుడ్ ఏలేస్తానని తెలియకుండానే భూషణ్ కెమెరాకు పోజులిచ్చింది. మద్రాస్‌లో సినిమాటోగ్రాఫర్‌గా స్నేహానుబంధాలలో చిక్కగా అల్లుకుపోయిన భూషణ్ నాటి కెమెరాలో, దాక్కున్న ఒకప్పటి బాల్యనటి దశ శ్రీదేవి ఫొటో యిది. 1970లో ‘మా నాన్న నిర్దోషి’ చిత్రంలో హీరో కృష్ణ కూతురుగా, తరువాత ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రామిరెడ్డిగారి చిత్రంలో నాగభూషణం కూతురుగా ఎన్నో చిత్రాలలో తరువాత బాలనటిగా విశేష ప్రతిభ ప్రదర్శించిన శ్రీదేవి, చిన్ననాటి బాల్యమిత్రురాలు కుట్టి పద్మినితో వున్న ఫొటో జి.ఎన్.భూషణ్ క్లిక్ అనిపించారు. ఆమె ఉజ్జ్వల భవిష్యత్తుకు నాంది పలికిన ఛాయాచిత్ర మాంత్రికుడు హైదరాబాద్‌లో 2013లో స్వర్గస్థులయ్యారు.
-జయసూర్య
*
చిత్రాలు.. బాల్యమిత్రురాలు కుట్టి పద్మినితో శ్రీదేవి
*ఫొటోగ్రాఫర్ జి.యన్.భూషణ్