చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివికేగిన.. సౌందర్యం
*
భారతీయ చిత్రసీమలో అతిలోకసుందరిగా ప్రసిద్ధిగాంచిన శ్రీదేవి అకాల మృతి అందర్నీ శోకసంద్రంలో ముంచేసింది. శ్రీదేవి భువినుంచి దివికి వెళ్లిపోయిందన్న వార్త ఒక్కసారిగా చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే కాదు, అంతటా ఆమె మరణ వార్తతో విషాద ఛాయలు అలముకున్నాయి. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం విచారమకరమంటూ చిత్రసీమ సంతాపాన్ని ప్రకటించింది. ఆమెతో కలిసి పనిచేసిన దర్శకులు, సహనటులు శ్రీదేవి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆమెలా ఎవరూ చేయలేరు: కృష్ణంరాజు
శ్రీదేవి మరణం భారతీయ సినిమా పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. శ్రీదేవి పోషించిన పాత్రల్లో ఎవరూ చేయలేనంత గొప్పగా నటించింది. సెట్లో చాలా హుందాగా వ్యవహరించేది. ఆమెలా ఎవరూ చేయలేరు.
లోటు తీర్చలేనిది: మంత్రి తలసాని
బాల నటిగా వెండితెరకు పరిచయమైన శ్రీదేవి అటు తర్వాత ఎన్‌టిఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి గొప్ప నటులతో నటించారు. బాలీవుడ్‌లోనూ తన ప్రతిభ చాటుకున్నారు. ఆమెలేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
నటన చిరస్మరణీయం: పవన్ కళ్యాణ్
భారతీయ వెండితెరపై తనదైన ముద్రను వేసిన శ్రీదేవి హఠాన్మరణం నమ్మలేనిది. ఆమె మరణవార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆమె నటన చిరస్మరణీయం. ఆమె కుటుంబానికి ఈ విషాద్నా తట్టుకునే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను.
తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: డా.టి.సుబ్బరామిరెడ్డి,
శ్రీదేవి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. నమ్మలేకపోతున్నాను. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరనిలోటు. బాలీవుడ్‌లో యాష్‌చోప్రా రూపొందించిన ‘చాందిని, లమ్హే’ చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వనె్న తెచ్చాయి. ఆమె కీర్తిని దశ, దిశలా వ్యాపింపజేశాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాల, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
స్వయంకృషితో ఎదిగిన తార : కె.రాఘవేంద్రరావు
శ్రీదేవి మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. పదహారేళ్ల వయసు నుంచి జగదేకవీరుడు అతిలోకసుందరి వరకు తనతో చాలా సినిమాలు తీశాను. శ్రీదేవి స్వయంకృషితో ఎదిగినతార.
విచారకరం: సి అశ్వనీదత్
అందం, అభినయంతో అందర్నీ మెప్పించిన తార శ్రీదేవి మరణం విచారకరం. ముంబయి వెళ్లినప్పుడల్లా ఆమె కుటుంబంతో మాట్లాడేవాడిని. ఆమె చిన్నప్పటినుంచి చాలా ఆరోగ్యం ఉండేవారు.
ఎంతో చలాకీగా ఉండేది : చంద్రమోహన్
బాలనటిగా ఉన్నప్పటి నుంచీ శ్రీదేవి నాకు బాగా తెలుసు. అందరితోనూ ఎంతో చలాకీ ఉండేది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
జీర్ణించుకోలేకపోతున్నా: మురళీమోహన్
శ్రీదేవి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేపోతున్నా. బాలనటిగానే ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. ఆమె లేని లోటు తీర్చలేనిది.
దిగ్భ్రాంతికి లోనయ్యా: ఎన్‌టిఆర్
శ్రీదేవి స్వర్గం నుంచి వచ్చారు. చూశారు. గెలిచారు. మళ్లీ అక్కడికే వెళ్లిపోయారు. ఆమె అకాలమృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
షాక్‌కు గురిచేసింది: వెంకటేశ్
శ్రీదేవి చనిపోయిందంటే నమ్మలేకున్నాను. చాలా బాధాకరం. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి.
మరపురాని నటి: నాగార్జున
శ్రీదేవి మరపురాని నటి. ఆమె ఆత్మకు శాంతికలగాలి.
అందరీ ఇష్టమే: జయసుధ
శ్రీదేవి అంటే అందరికీ ఇష్టమే. తను నేను మంచి స్నేహితులం. ఆమె మరణవార్త నన్ను బాగా కృంగదీసింది.
తీరనిలోటు: రవితేజ
శ్రీదేవి మరణం భారతీయ సినీ ప్రపంచానికి తీరనిలోటు. ఆమె చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకున్నా.
ఎందరికో ఆదర్శం: రోజా
ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఎందరికో ఆదర్శం. ఆమె మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మేమంతా అభిమానులమే: శివాజీరాజా
అతిలోకసుందరిగా అభిమానుల గుండెల్లో కొలువైన శ్రీదేవి ఇక లేరంటే నమ్మశక్యం కావడం లేదు. శ్రీదేవికి మేమంతా అభిమానులమే. ఆమె మృతి చిత్రసీమకు తీరనిలోటు.

-శ్రీ