ఇది పిల్లలు చూడాల్సిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎలుకా మజాకా’ చిత్రంలో కథ ఓ గమ్మతె్తైంది. వినాయకస్వామిని పట్టించుకోని హీరోను ఎలుక ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందన్న కథనంతో రూపొందించారు. ఇది పిల్లలతో కలసి చూడాల్సిన సినిమా.. అని దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు.
నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీ పతాకంపై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో బ్రహ్మానందం, వెనె్నల కిషోర్, రఘుబాబు ప్రధాన తారాగణంగా మారెళ్ల నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ సినిమా ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు పాత్రికేయుల సమావేశంలో చిత్ర విశేషాలను తెలుపుతూ, స్టార్ హీరోలు లేని ఈ చిత్రాన్ని ఎవరూ కొనకపోతే నిర్మాతలే ముందుకు వచ్చి విడుదల చేస్తున్నారని, ఇది దర్శకుడు రేలంగి ట్రేడ్ మార్క్ చిత్రంగా నిలుస్తుందని, గ్రాఫిక్స్‌తో అద్భుతంగా రూపొందించారన్నారు. ఎలుకతో నటింపజేయడం కష్టం కనుక దాదాపు 40 నిమిషాలపాటు గ్రాఫిక్స్ వర్క్ చిత్రంలో ప్రేక్షకులను అలరిస్తాయని, మొదటివారం సినిమా చక్కగా ఆడితే విజయవంతమైనట్లేనని, వెనె్నల కిషోర్ మంచి టైమింగ్ ఉన్న నటుడని ఆయన అన్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా గ్రాఫిక్స్‌తో సినిమా తీశానని, ఎలుక పాత్రలో బ్రహ్మానందం అద్భుతంగా నటించాడని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. వినోదంతో పాటు అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుందని, కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమని నిర్మాతలు తెలిపారు. కార్యక్రమంలో వెనె్నల కిషోర్, పావని, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.