మార్చి 4న కల్యాణ వైభోగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ ‘అలామొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత’లాంటి కుటుంబ కథాచిత్రాల తరువాత బి.వి.నందినిరెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం 14నెలలుగా వర్క్ చేశాం. ఇటీవలే ఆడియో విడుదల కాగా, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లక్ష్మీభూపాల్ పాటలన్నీ రాశాడు. కంటెంట్, కథ విషయానికొస్తే సన్నివేశాలు ఒకేలా ఉంటాయి. కళ్యాణ్‌మాలిక్ నాలుగైదు సినిమాలకు మాతోపాటే ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన అందించిన ఈ ఆల్బం ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా రాజు అనే సినిమాటోగ్రాఫర్‌ను పరిచయం చేస్తున్నాం. సెన్సార్ పూర్తయిన తరువాత ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా పెళ్లిపీటల మీద తీసుకునే సెల్ఫీ ఫొటో బాగా ఫేమస్ అయింది. ఇదొక లవ్‌స్టోరీ అయినా రెగ్యులర్ సినిమాలా ఉండదు. ప్రస్తుతం ఉన్న యువతకు ప్రేమ, పెళ్లి,విడాకులు అంటే సరైన నిర్వచనం తెలియట్లేదు. ఆ విషయాలను డిస్కస్ చేస్తూ.. ఎంటర్‌టైనింగ్‌వేలో ఈ సినిమాను తీశాం.’ అన్నారు.ఈ చిత్రంలో రాశి, ఐశ్వర్య, రాజ్‌మదిరాజ్, తా.రమేష్, ధన్‌రాజ్, హేమంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం: కళ్యాణ్‌కోడూరి, కెమెరా: జి.వి.ఎస్.రాజు, ఎడిటింగ్: జునైద్‌సిద్ధిక్, మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్, నిర్మాత: కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి.