అలీ నిర్మాతగా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీద్‌ఖాన్, శ్రీ, రీమా ప్రధాన తారాగణంగా నజీమ్ దర్శకత్వంలో లక్ష్మీశ్రీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. హాస్య నటుడు అలీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు నజీమ్ మాట్లాడుతూ, హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలో పేరును ప్రకటిస్తామని తెలిపారు. కథకు అనుగుణంగా ఓ ఐటమ్ పాటలో చాహత్ నృత్యం చేసిందని, మార్చిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.సన్నీ, ఎడిటింగ్: వీరేంద్ర, నిర్మాత: అలీ, దర్శకత్వం: నజీమ్.