త్వరలో దర్శకత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు అనీల్ సుంకర. ఓ వైపు భారీ ప్రతిష్ఠాత్మక చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు అభిరుచిగల చిన్న చిత్రాలను నిర్మిస్తూ విజయపథంలో సాగుతున్నారు. తాజాగా ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఆయన నిర్మించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. నిఖిల్ హీరోగా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 16న విడుదల కానున్న సందర్భంగా నిర్మాత అనీల్ సుంకర చెప్పిన విశేషాలు...
కంటెంట్ నచ్చింది!
నాకెప్పటినుంచో శివ లాంటి చిత్రం చేయాలని యాంబిషన్‌గా పెట్టుకున్నాను. అనుకోకుండా కన్నడంలో కిరిక్ పార్టీ చిత్రాన్ని చూడడం జరిగింది. కంటెంట్ బాగా నచ్చడంతో తెలుగు హక్కుల్ని తీసుకున్నాను. దాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చిన్న చిన్న మార్పులు చేసి కిరాక్ పార్టీ పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. అందుకే చాలా నమ్మకం ఉన్నాం.
వేరే దర్శకుడితో...
ఈ సినిమా అనుకున్న తరువాత కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వం చేస్తారని అనుకున్నాం. కానీ తెలుగు తమిళ భాషల్లో చేద్దామన్నారు. దానివల్ల రెండు భాషల్లో ఒకేసారి ఫోకస్ పెట్టడం ఇష్టం లేక వద్దన్నాను. ఆ తరువాత ఆ సినిమాకు పనిచేస్తున్న శరన్‌ను కంటిన్యూ చేశా. ఒరిజనల్ వెర్షన్ 2 గంటల 45 నిమిషాలు వుంటుంది. కానీ దాన్ని 2 గంటల 15 నిమిషాలకు కుదించాం. ఇందులో ఐదు పాటలుంటాయి.
రియల్ సంఘటనలు..
కథ కాలేజీ నేపథ్యంలో సాగుతుంది. నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో సాగే కథ. ఒక యువకుడి జీవిత లక్ష్యం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లింది అనేదే ప్రధాన పాయింట్. కాలేజీ సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. నిఖిల్ అద్భుతంగా చేశాడు.
దర్శకుడిగా..
నేను దర్శకుడిగా నరేష్‌తో చేసిన యాక్షన్ 3డి చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా ఇపుడు చూస్తే చాలా సరదాగా వుంటుంది. ఏదో చేయాలన్న తపనతో 3డిలో చేశాం. మామూలు బడ్జెట్‌లో చేసి వుంటే బావుండేది. ఇక దర్శకుడిగా త్వరలోనే మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయింది. ఓ స్టార్ హీరోతోనే సినిమా వుంటుంది.
మహేష్‌తో..
ఖచ్చితంగా మహేష్‌బాబుతో సినిమా చేస్తాను. ఎందుకంటే ఆయనతో మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దూకుడు సంచలన విజయం తరువాత 1 నేనొక్కడినే సినిమా విషయంలో నిర్మాతలుగా మేం నష్టపోయాం తప్ప డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్ అయ్యారు. ఆ సినిమా బాగుంది, కాకపోతే కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఇక ఆగడు విషయంలో అంచనాలు తారుమారు అయ్యాయి. ఈసారి మహేష్‌తో చేస్తే ఖచ్చితంగా హిట్ చిత్రం చేస్తాను. లేకపోతే ఆయన అభిమానులు నన్ను క్షమించరు.
తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా సురేష్ ప్రొడక్షన్‌తో కలిసి నిర్మిస్తున్నాం. ఈనెల 26న ప్రారంభం అవుతుంది. దాంతోపాటు రాజ్‌తరుణ్ నటించిన రాజుగాడు విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే శర్వానంద్‌తో ఓ సినిమా వుంటుంది.

చిత్రం..నిర్మాత అనీల్ సుంకర

-శ్రీ