రెగ్యులర్ షూటింగ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నాగార్జున, నానిల కాంబినేషన్‌లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కే భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 18 నుంచి మొదలుకానుంది. ప్రస్తుతం అమెరికాలో మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్ర వివరాల గురించి నిర్మాత అశ్వనీదత్ తెలియజేస్తూ- వైజయంతి బ్యానర్‌లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద విజయం సాధించాయి. ఆ స్థాయిలోనే ఈ సినిమాలోని పాటలు కూడా వుంటాయి. ప్రస్తుతం అమెరికాలో మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. మా బ్యానర్‌లో ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చి ఘనవిజయాలు సాధించాయి. చాలా రోజుల తరువాత నాగార్జున-నానిల కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం కూడా ఆ స్థాయిలోనే వుంటుంది అన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ- ఎంటర్‌టైనింగ్‌గా సాగే డిఫరెంట్ కథ ఇది. నాగార్జున-నానిలతో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:శ్యామ్‌దత్, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, సంగీతం:మణిశర్మ, నిర్మాత:అశ్వనీదత్, దర్శకత్వం:టి.శ్రీరామ్ ఆదిత్య.