ఎన్టీఆర్ సినిమాలో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో ఓ చిత్రం రూపొందనుందన్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించే ఈ చిత్రం ఈనెల 29న ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌ని ఎన్టీఆర్ భార్య పాత్రలో తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ పాత్ర కోసం విద్యాబాలన్‌ను సంప్రదిస్తున్నారని బి టౌన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. విద్యాబాలన్ అయితే అటు హిందీతోపాటు సౌత్‌లో కూడా ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుందని భావించారట. ఎన్టీఆర్ జీవితం చాలామందికి స్ఫూర్తినిచ్చేలా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విద్యాబాలన్ నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి వుంది.