నాగ్ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ భామ అమలాపాల్ ప్రస్తుతం హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకునే పనిలో బిజీగా మారింది. కెరీర్ ప్రారంభంలోనే సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన ఈమె, ఆ సమయంలోనే దర్శకుడితో ప్రేమాయణం సాగించి పెళ్లిచేసుకుంది. ఆ తరువాత సినిమాలకు దూరమైన అమలాపాల్, కొద్దిరోజులకే భర్తతో విడిపోయింది. మళ్లీ హీరోయిన్‌గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామకు పెద్దగా అవకాశాలు కలిసిరావడంలేదు. వచ్చినా సినిమాల్లో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో మళ్లీ గ్లామర్‌పై దృష్టిపెట్టింది. అంతేకాదు, స్లిమ్ అవతారంలో షాకిచ్చింది. ప్రస్తుతం అమలాకు వరుస అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే రెండు తమిళ చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా తెలుగులో నాగార్జున, నానీల మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఈమె కన్పిస్తుందట. మరోవైపు మంచు విష్ణు సరసన మరో అవకాశం దక్కించుకుంది. మొత్తానికి అమల గ్లామర్ పాత్రల ఎంపికతో మళ్లీ తన క్రేజ్‌ను పెంచుకునే పనిలో పడింది.
సినిమాలో..?
అమలాపాల్