ఆ టైటిల్ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ పెట్టారని ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి సాయిధరమ్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఈ విషయంపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ ప్రస్తుతం ‘దేవుడు వరమందిస్తే..’ అనే టైటిల్ మా చిత్రానికి పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు. త్వరలోనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తామంటూ తెలిపాడు. సాయిధరమ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.