బంగారు తెలంగాణ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిపిన్, రమ్య, అక్షర, లయన్ ఏవి స్వామి, బాబూమోహన్, సాయి త్రిశాంక్ ప్రధాన పాత్రలలో షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై కూర అంజిరెడ్డి సమర్పణలో బిపిన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బంగారు తెలంగాణ’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆడియో సీడీలను రిలీజ్ చేసారు. బిపిన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకలర్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత, దర్శకుడు బిపిన్, లయన్ ఏ.వి.స్వామి, రమ్య, అక్షర, అశోక్‌కుమార్, కూర అంజిరెడ్డి, సురేందర్‌రెడ్డి, సాయి త్రిశాంక్, దైవజ్ఞశర్మ, ‘షిరిడీసాయి’ నిర్మాత సురేష్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీని కూర అంజిరెడ్డి రిలీజ్ చేసి తొలి సీడీని ఏవి స్వామికి అందించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు బిపిన్ మాట్లాడుతూ ‘తెలంగాణకోసం ఎంతోమంది పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకొన్నారు. ముఖ్యంగా కేసీఆర్‌గారు ఆమరణ నిరాహారదీక్ష చేసి తెలంగాణకోసం ప్రాణాలు లెక్కచేయకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. కేసీఆర్‌గారి కృషివల్లే బంగారు తెలంగాణ సాధ్యం అయింది. అసలు తెలంగాణ ఎలా వచ్చింది.. అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రంలో ఐదు పాటలు వున్నాయి. బండారు దానయ్య హెల్ప్‌తో పాటలన్నీ నేనే రాసుకున్నాను. బిగ్ సింగర్స్ పాటలు పాడారు. సినిమా పూర్తిఅవడానికి నా మిత్రులు ఎంతోమంది సహకరించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు మా సినిమా రిలీజ్‌కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. త్వరలోనే ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం అన్నారు.