పూరి దర్శకత్వంలో అల్లరి నరేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ హీరోగా ఓ ముద్ర వేసుకున్న అల్లరి నరేష్ తన 13ఏళ్ళ కెరీర్‌లో 50 సినిమాలు పూర్తిచేసాడు. ఆయన నటించిన తాజా సినిమా ‘మామ మంచు-అల్లుడు కంచు’ ప్రేక్షకులను నిరాశ పరిచింది. దాంతో ఈసారి ప్రేక్షకులను మెప్పించే కథతో రావాలని నరేష్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం నరేష్ ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇదికాకుండా బివిఎస్‌ఎన్‌ప్రసాద్ బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్ళే పనిలో నరేష్ ఉన్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేయనున్నాడట! త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.