పవర్‌స్టార్ కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు కుర్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడు ఆ తరువాత ఎన్టీఆర్‌తో ‘రభస’ చేశాడు. ‘అజ్ఞాతవాసి’ తరువాత పవన్‌తో సినిమా చేయాలని ఆయనకు కథ చెప్పి మరీ ఒప్పించాడు. కానీ ‘అజ్ఞాతవాసి’ ఇచ్చిన ఫలితంతో పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారడం, ఇకపై ఆయన ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేకపోవడంతో సంతోష్ శ్రీనివాస్‌లో నిరాశ ఎదురైంది. ఇటీవలే పవన్ శ్రీనివాస్‌ను పిలిపించి ఈ సినిమా చేయనని వేరేవాళ్లతో చేయమని సున్నితంగా చెప్పాడట. దాంతో ఇదే కథను గోపీచంద్‌తో చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే కథను వినిపించి గోపీచంద్‌తో ఓకె చెప్పించుకున్న ఈ దర్శకుడు త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. గోపీచంద్‌తో ‘సాహసం’ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని నిర్మించిన భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది.