కబడ్డీ ఛాంపియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె.్ఫలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మహిళా కబడ్డీ’. రచన స్మిత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవలే మూడవ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రంకోసం ఉగాది పండుగపై ఒక ప్రత్యేక పాటను సంగీత దర్శకుడు బోలే షావళి సంగీత సారధ్యంలో రూపొందించడం జరిగింది. ఈ పాటను ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు ఫిలిం ఛాంబర్‌లో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ... ‘ఆర్.కె.్ఫలింస్ అంటే నా సొంత బేనర్ లాంటిది. నా కెరీర్ ప్రారంభ దశలో ఈ బేనర్‌లో నటించాను. అప్పటినుంచి మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగపై చేసిన పాటను నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బోలే షావళి అద్భుతంగా రాసి, కంపోజ్ చేయగా వరం అనే నూతన గాయని ఎంతో వినసొంపుగా పాడింది. ఈ పాటతో ఉగాది పండుగ ముందే వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ పాటలా సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతోందని’ అన్నారు. దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ..‘మా బేనర్‌లో చాలా గ్యాప్ తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని ఉగాది పండుగపై వచ్చే ప్రత్యేక పాటను బోలే రాసి, కంపోజ్ చేయగా వరం అనే నూతన గాయని అద్భుతంగా ఆలపించింది. మహిళలు ఎందులో తక్కువ కాదనే కానె్సప్ట్‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఒక పల్లెటూరు అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయిలో కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగిందనేది మెయిన్ కథాంశం. రచన స్మిత్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. శివాజీ రాజాగారు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మా బేనర్ తొలి హీరో అయిన శివాజీ రాజాగారి చేతుల మీదుగా మాత్రంలోని తొలి పాట లాంచ్ చేయడం చాలా సంతోషం. అలాగే మా చిత్రంలో ఫేమస్ సింగర్ మంగిలి కూడా ఒక పాట పాడారు. రాజ్ కిరణ్ కంపోజ్ చేసిన ఆ పాటను ఉగాది పండుగ తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. సంగీత దర్శకుడు బోలే షావళి మాట్లాడుతూ... ‘ఉగాది పండుగపై పాట రాసి, కంపోజ్ చేసే అవకాశం కల్పించిన ప్రతానిగారికి నా ధన్యవాదాలు’’ అన్నారు.