ఎంఎల్‌ఏ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కళ్యాణ్‌రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి నిర్మిస్తున్న చిత్రం ఎంఎల్‌ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. మా బ్లూప్లానెట్ బ్యానర్‌పై ఇంతకుముందు సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని నిర్మించాం. ఇది రెండవ చిత్రం. పీపుల్స్‌మీడియా బ్యానర్‌తోకలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. గురువారం సెన్సార్ కార్యక్రమాలు జరపనున్నాం. అన్ని కార్యక్రమాల్ని త్వరలో పూర్తిచేసి చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తాం అన్నారు. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో ఇంతకుముందు అమెరికాలో రెండు ఇండిపెండెంట్ చిత్రాలను నిర్మించాం అన్నారు. భరత్‌చౌదరి మాట్లాడుతూ మొదటి చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఎంఎల్‌ఏ కూడా అందరికీ నచ్చేలా ఉంటాడు. కళ్యాణ్‌రామ్ ప్రతీ విషయంలో ఎంతో సపోర్ట్ అందించారు అన్నారు. దర్శకుడు ఉపేంద్రమాధవ్ మాట్లాడుతూ.. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కథ. టైటిల్ చూసి ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన కథ అనుకోవద్దు. ఫస్ట్ఫా కార్పొరేట్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. సెకండాఫ్ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, కళ్యాణ్‌రామ్‌కు కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: తమ్మిరాజు, సమర్పణ: టి.జి.విశ్వప్రసాద్, కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల, నిర్మాతలు: భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి, దర్శకత్వం: ఉపేంద్రమాధవ్.