18న వైజాగ్‌లో వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవిస్ పతాకంపై తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎంత సక్కగున్నావే సాంగ్ సంచలనం రేపింది. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని గురువారం విడుదల చేయనున్నారు. అలాగే ప్రీరిలీజ్ వేడుకను ఈనెల 18న వైజాగ్‌లోని ఆర్‌కె బీచ్‌లో జరపనున్నారు. 1985 నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్‌వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా చరణ్‌కి సంబంధించిన చిట్టిబాబు న్యూలుక్‌ను విడుదల చేశారు.