బంగార్రాజు ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం మంచి ఘన విజయాన్ని అందుకుంది. అందులో బంగార్రాజు పాత్రలో నాగ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిట్ తర్వాత బంగార్రాజు నేపథ్యంలో మరో చిత్రం తెరకెక్కించాలని పలుమార్లు నాగార్జున ప్రయత్నించాడు. అయితే సరైన కథ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే కళ్యాణ్‌కృష్ణ మరో కథను నాగ్‌కు చెప్పాడట. కానీ స్క్రిప్ట్‌పై అంత సంతృప్తిగా లేని నాగ్ కొన్ని మార్పులు చేయమని చెప్పాడట. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్న కళ్యాణ్‌కృష్ణ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టే తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణ రవితేజతో తెరకెక్కిస్తున్న చిత్రం త్వరలోనే పూర్తికానుంది. ఈ సినిమా పూర్తవగానే బంగార్రాజు తెరపైకి వస్తాడని అంటున్నారు. అయితే అటు నాగ్ నుంచి కానీ ఇటు కళ్యాణ్‌నుంచి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడేవరకూ ఆగాల్సిందే