కిరాక్ పుట్టించే పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రన్ పరింజా, సంయుక్త హెగ్డే హీరోహీరోయిన్లుగా షరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్‌సుంకర నిర్మించిన చిత్రం కిరాక్ పార్టీ. ఈ చిత్రం ఈనెల 16న విడుదలకు సిద్ధమైన సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సీడీని ఆవిష్కరించారు. అనంతరం సుధీర్‌వర్మ మాట్లాడుతూ.. రెండు కారణాలతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాం. మొదటిది నిర్మాత అనీల్ సుంకర పాషన్ అయితే రెండోది నిఖిల్, షరన్. ఈ సినిమాకోసం వీళ్లు పడ్డ కష్టం గురించి తెలుసు. ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుంది అన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నేను సినిమాలు తక్కువగా చూస్తాను. చైతన్య కాలేజి బ్యాక్‌డ్రాప్‌లో నిఖిల్ చేసిన ఈ చిత్రం చూశాను. అతని ఎనర్జీ, కష్టం గురించి తెలుసు. ఈ సినిమాకు అందరూ కష్టపడి పనిచేశారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. నిర్మాతకు మంచి లాభాలు తేవాలి అన్నారు. దర్శకుడు షరన్ మాట్లాడుతూ నిజాయితీగా కష్టపడి యంగ్ టీమ్‌తో ఇష్టపడి చేసిన సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. నిర్మాత అనీల్ మాట్లాడుతూ.. కన్నడంలో హిట్టయిన కిరిక్‌పార్టీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాం. ఈ సినిమా చూసిన వారందరూ ప్రేమలో పడతారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమాకోసం నా మిత్రులు సుధీర్‌వర్మ, చందు మొండేటి పనిచేశారు. కాలేజి అనగానే ఏదేదో ఊహించుకుంటారు. కానీ మహిళలకు గౌరవం ఇవ్వాలనే మెసేజ్‌తో ఈ సినిమా చేశాం. షరన్ కూడా ఎక్కడా టెన్షన్ పడకుండా అద్భుతంగా తెరకెక్కించాడు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా ఇది అన్నారు.