నిధికోసం అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, హన్సిక జంటగా కళ్యాణ్ దర్శకత్వంలో తమిళంలో ఘన విజయం సాధించిన గులేభకావళి చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అందిస్తున్నారు. రేవతి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మల్కపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ.. తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న చిత్రమిది. రేవతి పాత్ర హైలెట్‌గా సాగుతుంది. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ సినిమా గులేభకావళి అనే గ్రామంలో దాచి ఉంచిన నిధి కోసం జరిపే అనే్వషణ నేపథ్యంలో కథ సాగుతుంది. చాలా రోజులు తరువాత ప్రభుదేవా తమిళంలో హీరోగా నటించిన చిత్రమిది. ఆయన డ్యాన్స్, నటన హైలెట్‌గా నిలుస్తాయి. హన్సిక గ్లామర్ మరో ప్రత్యేక ఆకర్షణ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్.ఎస్.ఆనంద్‌కుమార్, నిర్మాత: మల్కపురం శివకుమార్, దర్శకత్వం: కళ్యాణ్.