హృదయాల్ని కదిలిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో గోపీ నైనర్ దర్శకత్వంలో శివలింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆర్.రవీంద్రన్, క్రేజీ ప్రాజెక్టులతో విజయాల్ని సాధిస్తున్న నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్ పతాకంపై తమిళంలో ఇటీవలే విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఆరమ్’ చిత్రాన్ని తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో ఈ నెల 16న విడుదల చేస్తున్నారు. నయనతార ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా పాత్రలో లీనమై నటించారు. ఈ స్పందన విన్న హీరోయిన్ నయనతార మాట్లాడుతూ- ఒక మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్లకు కట్టే విధంగా చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం. మారుమూల పల్లెటూళ్లలో చిన్నపిల్లలు బోరు బావిలో ప్రమాదవశాత్తు పడిపోతుంటే అటు అధికారులు, ఇటు ప్రజలు ఆ పాపని కాపాడ్డానికి ప్రయత్నించే తీరు అభినందనీయం. కాని దానికి కావలసిన వసతులు కల్పించకపోవడం చాలా బాధాకరం. ఈ విషయమే నన్ను ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చేలా చేసింది అన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తమిళంలో ఆరమ్ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి నయనతార కెరీర్‌లోనే పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకు వుంది. ఇప్పటికే చిత్రాన్ని చూసిన మీడియా మిత్రులు చాలా మంచి రివ్యూస్ ఇవ్వటం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని మార్చి 16న తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకు వస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
చిత్రం..నయనతార