13 మిలియన్ వ్యూస్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో జరుగుతోంది. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై సంచలనం రేపుతోంది. ఏకంగా 13 మిలియన్ వ్యూస్‌తో టాలీవుడ్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా దుమ్మురేపింది. శ్రీమంతుడు తరువాత కొరటాల శివ-మహేష్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ ఇష్యూ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలోని పాటలను ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేస్తారట. మహేష్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఖైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా వుంటుందని సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దాంతోపాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా వుంటుంది.