దర్శకత్వం చేస్తానంటున్న నిత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అలా మొదలైంది’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నిత్యామీనన్. మొదటి సినిమాతోనే మంచి అభినయ సామర్థ్యం ఉన్న నటిగా గుర్తింపుపొందిన ఆమె మొదట్లో బాలనటిగానూ నటించి, ఆ తరువాత జర్నలిజం వైపు మొగ్గు చూపి డిగ్రీ చేసింది. తరువాత పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ సినిమాటోగ్రఫీ కోర్సు చేద్దామని ప్రయత్నించి ‘అలా మొదలైంది’తో మనముందుకు వచ్చింది. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. సినిమాటోగ్రాఫర్ కావాలన్న తన కోరిక తీరనప్పటికి సినిమాకి దర్శకత్వం వహించాలనే కోరిక ఆమెలో బలంగా ఉందట. ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘మనసులోని భావాలను దృశ్యంగా మలచడంలోని ఆనందమే వేరు. ఖాళీ సమయాల్లో కథలు రాసే అలవాటు వుంది. అలా చాలా కథలు రాశా. ఆ కథలను తెరకెక్కించాలని కోరికగా వుంది’అని అంటోంది నిత్యా. నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తోంది.