ఆనంద్ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం నేల టికెట్ చిత్రంలో నటిస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత రవితేజ మరో దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.ఐ.ఆనంద్‌తో చిత్రం ఉంటుందని తెలిసింది. ఆనంద్ ఇటీవలే ఒక్కక్షణం చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇటీవలే వీరి మధ్య కధా చర్చలు జరిగాయని, త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మిస్తాడని టాక్. మరోవైపు రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడనున్నాయి.