చక్కనమ్మ చిక్కింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కనమ్మ చిక్కినా అందమే. కానీ మరీ ఇంత చిక్కిపోవడం ఏమిటా? అని అందరూ షాక్ అవుతున్నారు. తెలుగు భామ అంజలిని ఇప్పటివరకూ బొద్దుగుమ్మగా చూసినవాళ్లే. తాజాగా ఆమె ఫొటోలు చూసి ఏంటీ, అంజలేనా? అంటూ అడుగుతున్నారట. సీతమ్మ వాకిట్లో.., గీతాంజలి వంటి చిత్రాల్లో బొద్దుగుమ్మగా నటించి ఆకట్టుకున్న అంజలీకి ఆ తరువాత చేసిన సినిమాలు వరుస పరాజయాలను అందించాయి. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘చిత్రాంగద’ భారీ పరాజయం పాలవ్వడంతో అంజలికి అవకాశాలు తగ్గాయి. తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. ముఖ్యంగా కుర్ర హీరోల సరసన ఈమెకు అవకాశాలు రావడంలేదు. దాంతో స్లిమ్ అవ్వాలని నిర్ణయించుకుంది. దానికోసం బాగానే కష్టపడినట్లు వుంది. తాజాగా ఆమె ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి స్లిమ్ అవతారంలో అంజలి బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ దెబ్బతో అంజలి మరిన్ని అవకాశాలను పట్టేయడం ఖాయం.