బోయపాటితో బాలయ్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ -మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ అంటే ఆ క్రేజే వేరు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ సంచలన విజయం సాధిస్తే ఆ తరువాత వచ్చిన ‘లెజెండ్’ అంతకుమించి హిట్ అందుకుంది. అందుకే బాలయ్య-బోయపాటి కలయికలో వచ్చే సినిమా కోసం అటు నందమూరి అభిమానులు కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే ఓ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ, మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈనెల 29న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. అటు బోయపాటి కూడా రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే బాలయ్యతో సినిమా చేస్తాడట బోయపాటి. ఆయనకోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా 103 అయితే ఆయన 104వ సినిమా బోయపాటిదే కావచ్చు. అన్నట్లు ఈ చిత్రాన్ని జూన్ 10న బాలయ్య పుట్టినరోజు మొదలుపెడతారని టాక్.