కొత్తగా చేయాలన్న ప్రయత్నమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఎంఎల్‌ఏ ఈనెల 23న ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. తప్పకుండా ఓటేసి గెలిపించగలరని అంటున్నాడు మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎంఎల్‌ఏ) కళ్యాణ్‌రామ్. హీరోగా తనదైన ఇమేజ్‌ను కాపాడుకుంటూ మరోవైపు విభిన్నమైన చిత్రాలతో నిర్మాతగానూ సత్తా చాటుకుంటున్నాడు. ఆయన తాజాగా ఎంఎల్‌ఏగా మన ముందుకు వస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం 23న విడుదలకు సిద్ధమైన సందర్భంగా మన ఎంఎలఏ కళ్యాణ్‌రామ్ చెప్పిన విశేషాలు...
ప్రజలను మోటివేట్ చేసేలా..
ఈ సినిమాలో మంచి ప్రేమకథ వుంటుంది. దాంతోపాటు రాజకీయాల ప్రస్తావన సాగుతుంది. అలాగని పొలిటికల్ డ్రామా ఉండదు. ఒక గ్రామంలోని సమస్యలపై హీరో ఎలా పోరాటం చేశాడు? ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం ఇలా విఫలమైంది, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, ముఖ్యంగా గ్రామంలోని ప్రజలను ఎలా మోటివేట్ చేశాడన్నదనే ప్రధాన కథాంశం. పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ వేలో సాగుతుంది. డైలాగ్స్ కూడా కొత్తగానే వుంటాయి. అలాగని పొలిటికల్ అంశాలను టార్గెట్ చేసేలా ఉండదు. దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ప్రతీ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. సినిమా కమర్షియల్ యాంగిల్‌లో ప్రతి ఒక్కరికీ నచ్చేలా సాగుతుంది.
నటుడిగా సంతృప్తి
పటాస్ సక్సెస్ తరువాత నేను చేసిన సినిమాలు విజయం సాధించలేదు. నిజానికి పటాస్ కంటే ముందే షేర్ సినిమా ఒప్పుకున్నాను. కానీ పటాస్ సినిమాతో నాకు నటుడిగా చాలా సంతృప్తినిచ్చింది. షేర్ నిరాశరిచింది. అలాగే పూరీ జగన్నాధ్ చేసిన ఇజం కూడా సంతృప్తినిచ్చింది. ఈ సినిమాపై చాలా నమ్మకంతో వున్నాను. నటుడిగా మరో కోణంలో నన్ను చూపిస్తుంది. నేను ఎప్పుడైనా మంచి సినిమా చేశానా లేదా అనే ఆలోచిస్తాను తప్ప కమర్షియల్‌గా ఇది ఆడుతుందా లేదా అనే విషయాన్ని పట్టించుకోను. నటుడిగా కొత్త తరహా సినిమాలు చేయాలన్నదే నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఎప్పటికైనా విజయం సాధిస్తానని నమ్మకముంది.
నిర్మాతగా..
నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. నా బ్యానర్‌లో వస్తున్న సినిమాలు చూసి ప్రేక్షకులు ఏదో కొత్తగా ట్రై చేశాడులే అనుకుంటారు తప్ప, చెత్త సినిమా చేశాడ్రా అనుకోరు. నేను హీరోగా చేసే విషయంలో కూడా నిర్మాతల విషయంలో అలోచిస్తాను.
తారక్‌తో..
నాకు, తారక్‌మధ్య మా సినిమాలకు సంబంధించిన చర్చలు ఎక్కువే జరుగుతుంటాయి. చిన్నప్పటినుంచీ ఇద్దరిమధ్యా మంచి అనుబంధం ఉంది. చాలా విషయాలు మాట్లాడుకుంటాం. తను సినిమాల్లో ఎలా చేశాడో నన్ను అడిగి తెలుసుకుంటాడు. నేను కూడా నా సినిమాల గురించి తన అభిప్రాయం అడుగుతుంటాను. ఈ సినిమా ట్రైలర్ చూసి అన్నయ్యా, నీవు కొత్తగా కన్పిస్తున్నావని అన్నాడు.
మల్టీస్టారర్ కుదరలేదు
నిజానికి సాయిధరమ్‌తో ఓ మల్టీస్టారర్ చేయాల్సింది కానీ కథ మాకిద్దరికీ నచ్చకపోవడంతో కుదరలేదు. మంచి కథ కుదిరితే ఎవరితోనైనా సరే మల్టీస్టారర్ చేస్తా. త్వరలోనే ఓ కథ సిద్ధమవుతోంది. దాంతోపాటు జయేంద్ర దర్శకత్వంలో ‘నా నువ్వే’ చేస్తున్నాను. ఇది మంచి లవ్‌స్టోరీ. అసలు ఈ కథ నాకు చెప్పినపుడు లవ్‌స్టోరీలో నేనెలా నప్పుతాను అని అనుకున్నారని అడిగాను. కథ బాగా నచ్చింది కాబట్టే ఈ సినిమా ఒప్పుకున్నా.

- శ్రీ