బృందావనమది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిచాపణయ్, హర్షవర్ధన్ రానే హీరో హీరోయిన్లుగా జస్ట్ ఎంటర్‌టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకంపై తేజ డైమండ్స్ అధినేత శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (ఎన్.ఆర్.ఐ) నిర్మాతలుగా శ్రీ్ధర్ సీపాన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘బృందావనమది అందరిది’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని సెంపుల్ వీడియో విడుదలమ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ్ధర్ సీపాన మాట్లాడుతూ- విశాఖ సాగరతీరంలో వేసిన హీరోయిన్ ఇల్లుసెట్‌లో చిత్రీకరణ జరిపాం. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రిచా పణయ్, హర్షవర్ధన్ రానే, ఎంపీ శివప్రసాద్, హీరా సాహిలి, బెనర్జీ, తాగుబోతు రమేష్, భద్రంలతో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న నాకు మా టెక్నీషియన్స్, నటీనటులు చక్కటి సహకారం అందించారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. మా ఫస్ట్ షెడ్యూల్ మేకింగ్ అండ్ సెంపుల్ వీడియో టీజర్‌ని మన తెలుగు కొత్త సంవత్సరంలో విడుదల చేశాం. దీనికి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిగతా షెడ్యూల్ ఏప్రిల్ 1నుండి బెంగళూరులో, ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుతాం అని చెప్పారు. లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), పృథ్వీ, అదుర్స్ రఘు, బొడ్డ నారాయణ, సత్యం రాజేష్, జూ. రామిరెడ్డి, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: తమ్మ శ్యామ్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, పాటలు: సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, నిర్మాతలు: శ్రీనివాస్ వంగాల, ప్రభాకర్‌రెడ్డి కూతరు, రచన, దర్శకత్వం: శ్రీ్ధర్ సీపాన.