నరేష్‌కు ఐక్యరాజ్య సమితి గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటుడు డా.వి.కె నరేష్‌ను ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ డిప్లమాటిక్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్ అండ్ పీస్ కౌన్సిల్ జనరల్ (కల్చరల్ ఎఫైర్స్)గా నియమించింది. ఈ నెల 17న ఫిలిప్పినీస్ రాజధాని మనిలలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫిలిప్పినీస్ దేశాధ్యక్షుడు రోడిగ్రో ఆర్.దుటురోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి 15వందల మంది ఆగ్నేయ ఆసియా దేశాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు హాజరవడం విశేషం. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియా ఛాన్స్‌లర్ జనరల్, ఇండియన్ అంబాసిడర్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘కేవలం నటుడిగానే కాకుండా సామాజిక దృక్పథాన్ని గుర్తించి ఈ బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చాం. ఐక్యరాజ్య సమితిచే కౌన్సిల్ జనరల్‌గా నియమించబడిన మొట్టమొదటి నటుడు డా.వి.కె.నరేష్’’ అన్నారు. ఇదే సందర్భంలో నరేష్ తన సెకండ్ డాక్టరేట్‌ను అందుకోవడం విశేషం.