సూర్యకోసం ప్రత్యేక గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఓ రేంజ్‌లో భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక ఐటెమ్ సాంగ్ కోసం బిగ్‌బాస్ భామను దింపుతున్నారు. హిందీలో బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వీడెన్ భామ ఎల్లీ ఔరమ్‌తో ఈ పాటను రూపొందిస్తారట. ఎల్లీ ఔరమ్ బిగ్‌బాస్ షో తరువాత పలు బ్రాండ్స్‌కు మోడల్‌గా చేయడమే కాకుండా, హిందీలో కూడా ఒకటి రెండు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో ఆకట్టుకుంది. గ్లామర్ విషయంలో ఓ రేంజ్‌లో షాకిచ్చే ఈ భామతో ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేయిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తారట. ఈ చిత్రాన్ని మే 4న విడుదల చేస్తున్నారు.