సౌత్‌పై ఫోకస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాట్ హాట్ అందాలతో సౌత్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్న హాట్ భామ ఇలియానాకు బాలీవుడ్‌లో చుక్కెదురైంది. అక్కడ హీరోయిన్‌గా వెలగాలని తెగ ఆరాటపడి సౌత్‌లో వున్న మంచి అవకాశాలను వదిలేసి వెళ్లింది. బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది. ఆమె చేసిన ఏ హిందీ సినిమా కూడా కెరీర్ పరంగా సరైన సక్సెస్ ఇవ్వలేకపోయింది. దాంతో ఖాళీ సమయాల్లో తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ షికార్లు చేసిన ఈ అమ్మడి ఫోకస్ మళ్లీ సౌత్‌పై పడ్డట్టుంది. ఎందుకో తెలుసా? ఈమధ్య ఓ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సౌత్‌లో హీరోయిన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారని అంటుంది. ఇంత సడెన్‌గా ఈ అమ్మడికి సౌత్‌పై ఎందుకబ్బా అంత ప్రేమ అంటూ గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు. సో మొత్తానికి మళ్లీ సౌత్‌లో సినిమాలు చేయడానికి ఓ రకంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.