మమ్ముట్టి యాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భలే మంచి రోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్‌హిట్ సినిమాలనందించిన 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మూడవ చిత్రంగా ‘యాత్ర’ పేరుతో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆనందోబ్రహ్మ ఫేం మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్నాడు. తెలుగు ప్రజలకు దగ్గరై మహానాయకుడిగా ఎదిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. వై.ఎస్.పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- మహి దర్శకత్వంలో ఆనందోబ్రహ్మ తరువాత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం ఆనందంగా వుంది. మహి వై.ఎస్ జీవిత కథతో ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశాడు. కథ బాగా నచ్చడంతో మమ్ముట్టి కూడా ఒప్పుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధించే నాయకుడిగా ఎమోషనల్‌గా దగ్గరైన వై.ఎస్.జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: విజయ్ చిల్ల, శశిదేవిరెడ్డి, దర్శకత్వం: మహి వి.రాఘవ్.