విశాల్ టెంపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. పూరి మార్క్ స్టైల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీసు అధికారిగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రణ్‌వీర్‌సింగ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలో కూడా ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. భారీ మొత్తానికి హక్కులు స్వంతం చేసుకున్న విశాల్, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. విశాల్ సరసన హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంపిక చేశారట. వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విశాల్ టెంపర్‌ను చూపిస్తాడేమో చూడాలి!