అమెరికాలో సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం నేటినుంచి అమెరికాలో పాట చిత్రీకరణ జరుపుతోంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పాటను హీరో హీరోయిన్లపై తెరకెక్కిస్తారట. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీ్ధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై ఓ రేంజ్‌లో సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్‌లో భిన్నమైన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంగా తెరకెక్కుతుండగా, అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కన్పిస్తున్నాడు. ఏప్రిల్ 2వ వారంలో పాటలను విడుదల చేస్తారట. చిత్రాన్ని మే 4న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.