50 రోజుల ‘ఛలో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, రష్మిక జంటగా వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించిన ‘్ఛలో’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ శుక్రవారంతో 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- సినిమా ప్రారంభం నుండి సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై మంచి విజయానే్న అందుకుంది. మేం నమ్మినదాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. మా తొలి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం ఇలా 50 రోజులు పూర్తిచేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన వెంకీకి మంచి భవిష్యత్తు ఉండాలని, పెద్ద దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఇక మా రెండవ ప్రయత్నంగా నాగశౌర్యతో నర్తనశాల చిత్రాన్ని ప్రారంభించాం. కృష్ణవంశీ దగ్గర శిష్యుడిగా చేసిన చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. తప్పకుండా మీ సపోర్టు ఎప్పుడూ ఇలాగే వుంటుందని కోరుకుంటున్నాం అన్నారు.