ఆర్ ఆర్ ఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఓ అరుదైన కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రానికి సన్నాహాలు మొదలైన విషయం తెలిసిందే. బాహుబలి తరువాత రాజవౌళి దర్శకత్వంలో రూపొందే ఈ మల్టీస్టారర్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అసలుసిసలైన మల్టీస్టారర్‌గా తెరకెక్కే ఈ సినిమా గురించి ఎప్పుడైతే రాజవౌళి సోషల్ మీడియాలో ప్రకటించారో అప్పటినుంచీ ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఈమధ్యే చరణ్-ఎన్టీఆర్ కలిసి అమెరికాకు ఫొటోషూట్ కోసం వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక అనౌన్స్‌మెంట్ నిన్న వెలువడడంతో సర్వత్రా ఆసక్తి నెలకొనడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచేసింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ అంటూ అధికారిక వీడియోను విడుదల చేశారు. డి.వి.వి క్రియేషన్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ వీడియోను బట్టి చూస్తే ఈ చిత్రాన్ని డి.వి.వి క్రియేషన్స్ నిర్మిస్తోందని అర్థవౌతుంది. ఈ సినిమాకు సంబంధించిన వీడియోతో పాటు చిన్న మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు రాజవౌళి. గత నవంబర్ 18న ఎప్పుడైతే ఈ మల్టీస్టారర్ గురించి ప్రకటించామో అప్పటినుంచీ ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందంటూ తెలిపారు. అయితే ఆర్ ఆర్ ఆర్ అనేది సినిమా టైటిల్ కాదని రాజవౌళి, రామ్‌చరణ్, రామారావు అని అంటున్నారు.