సబ్ ఫీచర్

‘క్యాస్ట్‌లెస్’ కుటుంబం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై మూడు సంవత్సరాల ఓ లాయర్ తన పేరును చెప్పినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యంతో ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్కక్షణం అతను ఏం చెప్పాడో, వారు ఏం విన్నారో అర్థం కాలేదు. అది గమనించిన అతను తన పేరును, తన అన్నపేరును, చెల్లిపేరును చెప్పాడు. జనాలు ఇంకా ఆశ్చర్యపోయారు. కారణం అతని పేరు ‘క్యాస్ట్‌లెస్ జూనియర్’. అతని అన్నపేరు ‘క్యాస్ట్‌లెస్’, చెల్లిపేరు ‘షైన్ క్యాస్ట్‌లెస్’. ఏంటీ మీకూ అర్థం కాలేదా? మీరు సరిగ్గానే చదివారు. అతనిపేరు ‘క్యాస్ట్‌లెస్ జూనియరే’. వివరాల్లోకి వెళితే..
కేరళ రాజధానికి 67 కిలోమీటర్ల దూరంలో పునాలూర్ అనే పురపాలక సంఘం ఉంది. అందులో ‘క్యాస్ట్‌లెస్ హోం’ అనే మళయాళ నేమ్ బోర్డుతో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి పెద్దలు ముస్లిం వ్యక్తి అయిన ఫసూలుద్దీన్ అలికుంజు, క్రిస్టియన్ మహిళ అయిన ఆగ్నెస్ గాబ్రి యేల్.
ఫసూలుద్దీన్, ఆగ్నెస్‌లు ప్రేమించుకున్నారు. వారిద్దరివి సనాతన సంప్రదాయ కుటుంబాలు కావడంతో వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. ఫలితంగా ఆగ్నెస్ ఫసూలుద్దీన్‌ను కలుసుకోకుండా ఆగ్నెస్ కుటుంబ సభ్యులు ఆమెను గృహనిర్భంధంలో ఉంచారు. అప్పుడు ఫసూలుద్దీన్ కేరళలోని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి ఆమెను గృహనిర్భంధం నుంచి విడిపించాడట. తరువాత ఆ జంట వివాహం చేసుకోలేదు. సహజీవనం చేశారు.
1974లో వారికి ఓ బాబు పుట్టాడు. వారు అతనికి ‘క్యాస్ట్‌లెస్’ అనే పేరును పెట్టారు. తరువాత పుట్టిన ఇద్దరికీ కూడా ‘క్యాస్ట్‌లెస్ జూనియర్, షైన్ క్యాస్ట్‌లెస్’ అనే పేర్లను పెట్టారు. ఆ జంట ముగ్గురు పిల్లలను ఎటువంటి కుల, మతపరమైన ఒత్తిడులు లేకుండా కేవలం సాంఘిక ప్రవర్తనతో, మానవత్వంతో పెంచారు. పాఠశాల రికార్డుల్లో, ఇతర డాక్యుమెంట్లలో మతపరమైన వివరాలు అడిగినప్పుడు ‘నిల్’ అని పెట్టేవారు. పిల్లలు కానె్వంటుల్లో చేరినప్పుడు యాజమాన్యం వీరిపై ఏదో ఒక మతాన్ని ఎంచుకోమని, పిల్లల పేర్లను మార్చమని ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆ తల్లిదం డ్రులు అంగీకరించలేదు. ‘18 సంవత్సరాలు వచ్చిన తరువాత మా పిల్లలే ఏ మతాన్ని ఎంచుకోవాలో, ఏ పేర్లు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటారు’ అనే సమాధానాన్ని చెప్పి వారిని తిప్పి పంపించారు.
అలా వారు దాదాపు 19 సంవత్సరాల పాటు కలిసి జీవించారు. వారి దగ్గర ఎటువంటి వివాహప్రమాణప్రతం లేదు. అలాగే ఆ జంట ఎటువంటి మతాచారాన్ని కూడా పాటించలేదు. కానీ ఆచరణాత్మక అవసరాల కోసం, అస్తిత్వం కోసం వారు 1992లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారి బంధాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌గా రెట్రో స్పెక్టివ్ ప్రొవిజన్లో ఉంచింది ప్రభుత్వం. తమ పిల్లలు ఎటువంటి కుల, మతపరమైన జాఢ్యాలు అంటకుండా మానవత్వంతో బతకాలని ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు.
ఫసూలుద్దీన్, ఆగ్నస్‌లలాగే వారి పిల్లలు కూడా పెళ్ళి చేసుకున్నప్పుడూ ఎటువంటి కట్నాలు తీసుకోలేదు. ఎటువంటి ఆచారాలు పాటించలేదు. వీరు కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే వివాహాలు చేసుకున్నారు. వీరు భాగస్వాములను ఎంపిక చేసుకున్నప్పుడు ముందుగానే వారికి తమ వివరాలను తెలియజేసి.. వారు అంగీకరించిన తర్వాత మాత్రమే వివాహాలు చేసుకున్నారు. ఇప్పుడు క్యాస్ట్‌లెస్ పునలూరు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా వున్నాడు. అతని భార్య సబిత ఎం.బి.ఏ చదివింది. వారికి ఇద్దరు పిల్లలు ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్, ఇండియన్ క్యాస్ట్‌లెస్’. క్యాస్ట్‌లెస్ జూనియర్‌ది లాయర్ వృత్తి. అతను రాజ్యలక్ష్మి అనే హిందువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి ‘ఆగ్న క్యాస్ట్‌లెస్ జూనియర్, ఆల్ఫా క్యాస్ట్‌లెస్ జూనియర్’ అనే ఇద్దరు పిల్లలు. షైన్ క్యాస్ట్‌లెస్ చెగువేరా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆ జంటకు ‘అలీడ చెగువేరా’ అనే అమ్మాయి ఉంది. ఇలా వీరందరూ తమ తల్లిదండ్రుల బాటలోనే నడిచారు.
‘మా తలిల్రదండులు ఇద్దరూ హేతువాదులు, లౌకికవాదులు. వారు సమాజం నుంచి ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా మాపై ఎప్పుడూ ఎటువంటి ఒత్తిడీ పెట్టలేదు. మమ్మల్ని చాలా స్వేచ్ఛగా పెంచారు. మా కోసం, మా అస్తిత్వం కోసమే వారు తమ బంధాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌గా నమోదు చేసుకున్నారు. వారి బాటలోనే మేము కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే వివాహాలు చేసుకున్నాం. ఇన్ని రోజులూ బాగానే గడిచింది. కానీ ఇప్పుడు మా బంధువుల నుంచి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ మతాన్ని, కులాన్ని పాటించకున్నా ఫర్వాలేదు కానీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టాలా? లేదా దహనం చేయాలా? అనే ప్రశ్నను మా ముందు ఉంచారు. అప్పుడు మేమందరం కలిసి కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయానే్న వారికి తెలియజేశాం. అది విన్న వారు ఆశ్చర్యపోయి మీరు మారరు అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ నిర్ణయం ఏమిటంటే.. మేం చనిపోయిన తరువాత మా అవయవాలను దానం చేయాలని, మా మృతదేహాలను శాస్ర్తీయ పరిశోధనకు అందజేయాలని మేం కోరుకుంటున్నాం’ అని చెప్పాడు క్యాస్ట్‌లెస్ జూనియర్.
మనుషులు కనిపిస్తూనే మీరు ఏ మతానికి చెందినవారు, ఏ కులానికి చెందినవారు అని చూసే ఈ సమాజంలో ఇలాంటివారు కూడా ఉన్నారా? అనిపిస్తుంది ఇలాంటివి చదివినప్పుడు. చనిపోయినప్పుడు కూడా దహనం చేయాలా? ఖననం చేయాలా? అని అడిగినవారిని చూసి జాలిపడి, మరేమీ ఆలోచించకుండా అవయవదానం చేసి తమ దేహంతో నాలుగు ప్రాణాలను నిలబెట్టాలనుకున్నవారిని చూస్తే దండం పెట్టకుండా ఎలా ఉంటాం అంతటి మహోన్నత వ్యక్తిత్వానికి.. మానవత్వానికి..

-విశ్వ