విజయంలో మోహన్‌రంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘్ఛల్ మోహన్‌రంగ’ నితిన్ నటించిన 25వ చిత్రమిది. కృష్ణచైతన్య దర్శకుడు, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలపై ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథను అందించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా... నితిన్ మాట్లాడుతూ ‘16 ఏళ్లల్లో 25 సినిమాలు పూర్తిచేయడం ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఒక మంచి కామెడీ లవ్‌స్టోరీ అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేయడం జరిగింది. సింపుల్ స్టోరీ అయినప్పటికీ, కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. అమెరికాలోనే కాకుండా ఇక్కడకూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్‌లో సినిమా చూశాను. ఆడియన్స్‌నుంచి రెస్పాన్స్ బాగుంది. చాలారోజుల తరువాత మంచి సినిమా చూశామని చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణం.. మా దర్శకుడు కృష్ణచైతన్య, ఆయన రాసిన మాటలు త్రివిక్రమ్‌గారి శైలిలో ఉన్నాయంటున్నారు. అను రాసిన డైలాగ్స్‌వల్ల, కమెడీ వల్ల మంచి పేరొచ్చింది. దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ‘్థయేటర్.. నవ్లుతో నిండిపోయింది. ఏ ఉద్దేశంతో తీశామో... అది నెరవేరినట్టయ్యింది. నేను ‘రౌడీ ఫెలో’ తీసినప్పుడు ఓ సీరియస్ ఫిల్మ్ తీశామనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు కామెడీతో సినిమా చేయడం కొత్త ఎక్స్‌పీరియన్స్. సింపుల్ స్టోరీతో సినిమా తీయడం కష్టమైన విషయంగానే చెప్పుకోవాలి. తమన్ ఎక్స్‌ట్రార్డినరీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆర్టిస్టులు అందరి సహకారం మరువలేనిది’అని అన్నారు.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు లవ్‌స్టోరీస్ ఎలా వస్తాయో అనుకున్నాను. కానీ కొత్తతరం దర్శకులు చాలా మంచి ప్రేమకథలతో సినిమాలు చేస్తున్నారు. అలా కామెడీ యాంగిల్‌లో వచ్చిన మరో ప్రేమకథాచిత్రమే ‘్ఛల్ మోహన్‌రంగ’. మంచి సక్సెస్ సాధించిన ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. జయంనుండి నేను నితిన్‌ను ఫాలో అవుతున్నాను. జయాపజయాలకు అతీతంగా నటుడిగా రాణిస్తున్నాడు అన్నారు.