వరుణ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ ప్రారంభంనుండి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి ఈమధ్య కెరీర్ కాస్త బ్రేక్ పడింది. ఈమధ్య చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలపాలవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దాంతో మళ్లీ క్రేజ్ తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈమెకు మెగా హీరో సరసన అవకాశం దక్కింది. వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘స్పేస్’ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలో ఓ హీరోయిన్‌గా ఇప్పటికే అతిథిరావు హైదరీని ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌గా లావణ్యను ఎంపిక చేశారట. ఇదివరకే వరుణ్‌తో లావణ్య ‘మిస్టర్’ చిత్రంలో నటించింది. రెండోసారి ఈ జోడీ కలిసి నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన స్పేస్ స్టేషన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై లావణ్య భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఆమె ఆశల్ని వరుణ్ నిలబెడతాడేమో చూడాలి!

చిత్రం..లావణ్య త్రిపాఠి