చివరి వారంలో దమ్ముంటే సొమ్మేరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతానం, ఆంచల్‌సింగ్ జంటగా శ్రీ తేన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై తమిళంలో రూపొందిన ‘దిల్లుడు దుడ్డు’ చిత్రాన్ని తెలుగులో ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల చివరిలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత నటరాజ్ వివరాలు తెలియజేస్తూ- ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది టీజర్. ఈ రెస్పాన్స్‌తో సినిమాపై చాలా నమ్మకం కలిగింది. సంతానం అంటే తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ వుంది. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం వుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశాం. త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: దీపక్ కుమార్ పత్తి, నిర్మాత: నటరాజ్.