రాజమండ్రిలో చుట్టాలబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రం దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ మార్చి 1న రాజమండ్రిలో ప్రారంభం కానున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ,‘ఓ సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్ మాస్టర్ సారధ్యంలో చిత్రీకరించాం. మార్చి 1నుండి 20వరకు రాజమండ్రిలో మరో షెడ్యూల్‌ను జరుపుతున్నాం’ అని తెలిపారు. దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ, ‘్ఫ్యమిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న దీనికి థమన్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. రాజమండ్రిలో జరిగే షెడ్యూల్‌తో సినిమా 70శాతం పూర్తవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాతలు: రాము తూళ్లూరి, వెంకట్ తలారి, దర్శకత్వం: వీరభద్రం.