మూడో పాటతో సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శిరీషాశ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అనూహ్యమైన స్పందన రావడంతో ఈనెల 13న మూడో సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్, టీజర్‌లో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆర్మీ అధికారిగా అల్లు అర్జున్ కనిపించే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ నటన హైలెట్‌గా వుంటుంది. ఈ సినిమా కోసం బన్నీ ఎంతో కష్టపడుతున్నాడు. డెడికేషన్‌తో నిజమైన మిలటరీ అధికారిగా పాత్రలో జీవించేశాడు. విశాల్-శేఖర్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ కానుంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని మే 4న విడుదల చేస్తున్నాం. తాజాగా మూడో సాంగ్‌ని ఈనెల 13న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

చిత్రం..అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్