మా ప్రయాణం అలా మొదలయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రామచంద్రన్ ముఖ్య తారాగణంలో హరహర చలనచిత్ర సమర్పణలో ఎస్.శ్రీకాంత్‌రెడ్డి, రామ్మోహన్‌రావు ఇప్పిలి నిర్మాతలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’. ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ బాటలో పయనిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్మోహన్‌రావు ఇప్పిలి చెప్పిన విశేషాలు..
* ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేశారు...?
- దర్శకుడు వరప్రసాద్ వరికూటి నా స్నేహితుడు. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. అప్పటినుంచే అతను మాకు మంచి కథలను చెప్పేవాడు. అతను సినిమా ఫీల్డ్‌కు వచ్చాక కూడా మాతో టచ్‌లో ఉండేవాడు. మా ప్రయాణం అలా మొదలయింది. అప్పుడే వరప్రసాద్ నాకు ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’ కథ వినిపించాడు, లైన్ చాలా బాగుంది. మంచి అవకాశం దొరికి అందరూ సహకరిస్తే కథను సినిమాగా మలచాలని భావించాం. అనుకున్నట్టే అన్నీ కుదిరాయి సినిమా స్టార్ట్ చేసాం. విడుదల కూడా చేసాం. సినిమా సక్సెస్ అయ్యింది. కథ గురించి చెప్పాలంటే.. ఒక నలుగురి కుర్రాళ్లల్లో ఒకరికి (హీరో నందు) నిశ్చితార్థం అవుతుంది. 36 గంటల్లో పెళ్లి ముహూర్తం.. ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారు. ఈలోగా ఆ నలుగురు వివిధ కారణాల చేత సమస్యల్లో ఇరుక్కుపోతారు. అప్పుడు ఆ పెళ్లి జరిగిందా..? మిగతా ముగ్గురు పెళ్లికి వచ్చారా...? ఆ సమస్య నుంచి ఎలా బయటపడతారు అనేది చిత్ర కథాంశం... దానే్న ఉత్కంఠ భరితంగా చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు వరప్రసాద్.

* థియేటర్ల ఫీడ్‌బ్యాక్ ఎలా వుంది?
- చాలా బాగుంది. ఈ శనివారానికి 40 థియేటర్లను పెంచుతున్నాం. ముఖ్యంగా బిసి సెంటర్‌లో మంచి టాక్ వస్తోంది. పెద్ద ఆర్టిస్టులు ఎవరూ లేకపోయినా కథ బాగుండటంతో మంచి పేరువస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ ఎవరూ బాగోలేదని చెప్పడం లేదు. వౌత్ టాక్‌తోనే పబ్లిసిటీ బాగొచ్చింది.. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నా..
* థియేటర్లను పెంచాలనే ఆలోచన ఎవరిది?
- డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనే. టాక్ బాగొచ్చింది థియేటర్లను పెంచుదామని అడిగారు. సరే అనడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రాలో రెస్పాన్స్ బాగుంది.
* కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?
- సంతృప్తికరంగానే ఉన్నాయి. అందరూ మెచ్చుకుంటున్నారు. చెప్పాలంటే చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్ వచ్చింది.
* సినిమా విడుదల ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది?
- సినిమాను తీయడం కంటే విడుదల చేయడమే కష్టం అనిపించింది. పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల సమస్య రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా విడుదల తేదీకోసం మేము మూడు నెలలపాటు ఎదురుచూసి ఈనెల 6న మంచి డేట్ అని ఫిక్స్‌అయి ఆరోజునే విడుదల చేయడం జరిగింది.
* మీ సర్కిల్‌లో అంటే కుటుంబం, స్నేహితులనుంచి
ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది?
- మంచి జాబ్స్‌చేసుకోకుండా సినిమా ఏంటని మొదట అందరూ అనేవారు, కానీ మేము మొదటినుంచీ కథను బాగా నమ్మాము. ప్రేక్షకులనుంచి వస్తున్న మంచి రెస్పాన్స్‌ను చూసి మంచి సినిమా చేశారని.. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ మెచ్చుకుంటున్నారు. కథనే నమ్మారని ఇప్పుడు మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది.
* మీ స్వస్థలం ఎక్కడ.. మీ వృత్తి ఏంటి?
- మాది శ్రీకాకుళం. మా పాట్నర్ ఒంగోలు వాసి. నేను జీ.వి.కె. బయోలో జూనియర్ సైన్టిస్ట్‌గా చేస్తున్నా. ప్రస్తుతానికి సెలవులో ఉన్నాను.
* ఈ సినిమా మీకెలా అనిపించింది?
- తాళిబొట్టు తీసేసే సీన్, తారా తిరిగి వచ్చే సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి.
* ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతారా?
- మంచి కథలు దొరికితే తప్పకుండా చేస్తాను. మా బ్యానర్‌లో తప్పకుండా మరో మంచి సినిమా ఉంటుంది.. ఆ వివరాలన్నీ అతి త్వరలోనే ప్రకటిస్తాం. మంచి సినిమాలనే తీయాలనే కానె్సప్ట్‌తో వచ్చాము అవే తీస్తాం.
* పెద్ద హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లున్నారు?
- ఇప్పుడు మంచి టీమ్ దొరికింది. మంచి రెస్పాన్స్‌కూడా వస్తోంది. హ్యాపీ. పెద్ద హీరోలతో అంటే అదృష్టం అవకాశం కలసివస్తే చేయాలనే వుంది. బాలయ్యతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది కానీ అది అత్యాశే అవుతుందని భావిస్తున్నా. ప్రస్తుతానికి ఇలానే సంతృప్తితో ఉన్నాం.